శ్రీరామపాదుకాయుగ్మ శ్రీరామానుజ తిరువారాధన

శ్రీభగవద్ రామానుజాచార్యుల తిరువడులను ధరించిన శ్రీరామ పాదుకలను సంప్రదాయబద్ధంగా ఆరాధించే పూజా విధానం.

తిరువారాధనకు పూర్వ సిద్ధత

(స్నానం చేసిన తరువాత శుభ్రమైన వస్త్రాలు ధరించి, ఊర్ధ్వపుండ్ర ధారణ చేయాలి. అనంతరం పూజకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకొని, భగవత్సన్నిధి వద్దకు చేరి సాష్టాంగ నమస్కారం చేయాలి. తరువాత తగిన ఆసనాన్ని గ్రహించి భగవత్సన్నిధిలో కూర్చోవాలి.)

(అనంతరం దీపారాధన)

దీపారాధన

(భగవత్సన్నిధిలో దీపాన్ని వెలిగించి, భక్తిపూర్వకంగా దీపారాధన చేయాలి.)

(అనంతరం పుండరీకాక్ష స్మరణ)

పుండరీకాక్ష స్మరణ

(బాహ్యాభ్యంతర శుద్ధికై, అనగా బాహ్యంగా మరియు అంతరంగంగా శుద్ధి పొందుటకై, “పుండరీకాక్ష” అని క్రింది విధంగా మూడు సార్లు స్మరించాలి.)

ఓం

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోఽపి వా ।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాఽభ్యంతర శుచిః ॥

పుండరీకాక్ష । పుండరీకాక్ష । పుండరీకాక్షాయ నమః ॥

(బొటన వ్రేలుతో నీరు తలపై చల్లుకోవాలి.)

(అనంతరం ఆచమనము)

ఆచమనము

(మనస్సును భగవంతునిపై నిలిపి ఆచమనము చేయాలి. కుడిచేతిని గోకర్ణ ఆకృతిలో ఉంచి, మూడు సార్లు వేర్వేరుగా, శబ్దం చేయకుండా తీర్థాన్ని స్వీకరించాలి. తలపై పూసుకోకూడదు.)

ఓం అచ్యుతాయ నమః
(మొదటిసారి తీర్థాన్ని స్వీకరించాలి.)

ఓం అనంతాయ నమః
(రెండవసారి తీర్థాన్ని స్వీకరించాలి.)

ఓం గోవిందాయ నమః
(మూడవసారి తీర్థాన్ని స్వీకరించాలి.)

(అనంతరం ద్వాదశనామ స్పర్శ)

ద్వాదశనామ స్పర్శ

(చేతిని కడిగి నీటితో శుద్ధపరచి, శరీరాన్ని భగవన్నామాలతో స్పృశించాలి.)

ఓం కేశవాయ నమః
(కుడిచేతి బొటన వ్రేలుతో పెదవులకు కుడివైపు తాకవలెను.)

ఓం నారాయణాయ నమః
(కుడిచేతి బొటన వ్రేలుతో పెదవులకు ఎడమవైపు తాకవలెను.)

ఓం మాధవాయ నమః
(కుడి ఉంగరపు వ్రేలుతో కుడి కంటిని తాకవలెను.)

ఓం గోవిందాయ నమః
(కుడి ఉంగరపు వ్రేలుతో ఎడమ కంటిని తాకవలెను.)

ఓం విష్ణవే నమః
(కుడి చూపుడు వ్రేలుతో ముక్కు కుడివైపున తాకవలెను.)

ఓం మధుసూదనాయ నమః
(కుడి చూపుడు వ్రేలుతో ముక్కు ఎడమవైపున తాకవలెను.)

ఓం త్రివిక్రమాయ నమః
(కుడి చిటికెన వ్రేలుతో కుడి చెవిని తాకవలెను.)

ఓం వామనాయ నమః
(కుడి చిటికెన వ్రేలుతో ఎడమ చెవిని తాకవలెను.)

ఓం శ్రీధరాయ నమః
(కుడిచేతి ఐదు వ్రేళ్లతో కుడి భుజాన్ని తాకవలెను.)

ఓం హృషీకేశాయ నమః
(కుడిచేతి ఐదు వ్రేళ్లతో ఎడమ భుజాన్ని తాకవలెను.)

ఓం పద్మనాభాయ నమః
(కుడిచేతి ఐదు వ్రేళ్లతో నాభిని తాకవలెను.)

ఓం దామోదరాయ నమః
(కుడిచేతి ఐదు వ్రేళ్లతో హృదయాన్ని, తరువాత నుదుటిని తాకవలెను.)

(ఈ విధంగా శరీరమంతా భగవన్నామాంకితమైనదని భావించాలి.)

(అనంతరం మంగళస్మరణం)

మంగళస్మరణం

(భగవంతుని స్మరిస్తూ, ఆరాధన నిర్విఘ్నంగా మరియు మంగళప్రదంగా కొనసాగాలని భావిస్తూ క్రింది మంగళశ్లోకాలను పఠించాలి.)

ఓమీ తదేవలగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ।
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే! తేఽఙ్ఘ్రియుగం స్మరామి॥

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః।
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ॥

ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం॥

స్మృతే సకలకల్యాణభాజనం యత్ర జాయతే।
పురుషం తమజం నిత్యం ప్రపద్యే శరణం హరిమ్॥

సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళమ్।
యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనో హరిః॥

(అనంతరం సంకల్పము)

సంకల్పము

(ఎడమ అరచేతిలో కుడి అరచేతిని అడ్డంగా చేర్చి, కుడి తొడపై ఉంచి సంకల్పము చెప్పాలి.)

శ్రీగోవింద గోవింద గోవింద శ్రీమహావిష్ణోరాజ్ఞయా, ప్రవర్తమానస్య, అద్యబ్రహ్మణః, ద్వితీయ పరార్ధే, శ్రీశ్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, శకాబ్దే, మేరోః దక్షిణదిగ్భాగే, శ్రీరంగస్య ఉత్తరదిక్ప్రదేశే, గంగా కావేర్యోః మధ్యదేశే, భగవద్భాగవత ఆచార్య సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన, శ్రీప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే,

శ్రీ……….నామ సంవత్సరే …… అయనే …… ఋతౌ …… మాసే …… పక్షే …… శుభతిధౌ …… వాసరే ……

శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిధౌ, భగవద్భాగవత ఆచార్య కైంకర్య రూపేణ, లోకక్షేమార్థం, సకల సంపత్ సమృద్ధ్యర్థం, సర్వజన సౌహార్దసిద్ధ్యర్థం, విశేషతః, ఆచార్య కృపయా శ్రీరామానుజ పాదసేవా కైంకర్య ప్రాప్త్యర్థం, శ్రీరామ పాదుకారాధనం అద్య కరిష్యే।

(కుడి ఉంగరపు వ్రేలుతో నీటిని తాకాలి.)

షోడశోపచార పూజ

ఓం సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః.
(నమస్కారం సమర్పించాలి.)

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
ధ్యాయామి. ధ్యానం సమర్పయామి.
(శ్రీరామ పరివారాన్ని, వారితో కూడిన శ్రీరామానుజ ఆచార్య పరివారాన్ని మనసులో ధ్యానించాలి.)

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
ఆవాహయామి.
(దోసిలి చూపుతూ, హృదయం నుండి పాదుకలపైకి రమ్మని ఆహ్వానించాలి.)

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
ఆసనం సమర్పయామి.
(పాదుకలపై మెత్తని పుష్పాలు సమర్పించాలి.)

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
అర్ఘ్యం సమర్పయామి.
(ఉద్ధరిణితో ఒకసారి నీటిని స్వామి హస్తాలకు సమర్పించి, పతద్గ్రహ పాత్రలో విడువాలి.)

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
పాద్యం సమర్పయామి.
(ఉద్ధరిణితో రెండుసార్లు వేరువేరుగా నీటిని స్వామి పాదాలకు సమర్పించి, పతద్గ్రహ పాత్రలో విడువాలి.)

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
ఆచమనీయం సమర్పయామి.
(ఉద్ధరిణితో మూడుసార్లు వేరువేరుగా నీటిని స్వామి నోటికి సమర్పించి, పతద్గ్రహ పాత్రలో విడువాలి.)

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
స్నానం సమర్పయామి.
(వీలునుబట్టి పాదుకలకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ఫలరసాలు మరియు మంచినీటితో అభిషేకం చేయాలి. అభిషేకం చేయుట సాధ్యం కానిచో, ఉద్ధరిణితో ఐదుసార్లు వేరువేరుగా నీటిని స్వామికి సమర్పించి, పతద్గ్రహ పాత్రలో విడువాలి.)

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
ప్లోతవస్త్రం సమర్పయామి.
(అభిషేకం చేసినట్లయితే, శుభ్రమైన వస్త్రంతో పాదుకలను తుడవాలి. అభిషేకం చేయనట్లయితే, పుష్పాన్ని సమర్పించాలి.)

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
వస్త్రయుగ్మం సమర్పయామి.
(పుష్పాలు సమర్పించాలి.)

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
ఊర్ధ్వపుండ్రం సమర్పయామి.
(బొట్టు పెట్టాలి.)

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
యజ్ఞోపవీతం సమర్పయామి.
(వీలునుబట్టి ముడివేసిన దారాన్ని సమర్పించాలి. లేకపోతే, పుష్పాన్ని సమర్పించాలి.)

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
హారిద్రాచూర్ణం సమర్పయామి.
(పసుపును సమర్పించాలి.)

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
కుంకుమాది పరిమళద్రవ్యాణి సమర్పయామి.
(కుంకుమను, వీలునుబట్టి ఇతర పరిమళ ద్రవ్యాలను సమర్పించాలి.)

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
దివ్యశ్రీచందనం సమర్పయామి.
(గంధాన్ని సమర్పించాలి.)

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
సర్వాభరణాలంకారాన్ సమర్పయామి.
(పుష్పాలతో అలంకరించాలి. వీలునుబట్టి ఇతర ఆభరణాలను కూడా సమర్పించవచ్చు.)

ప్రార్థన

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥

శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్ ।
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచరవినాశకరం నమామి ॥

యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ
వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే ।
అస్మద్గురోర్భగవతోఽస్య దయైకసింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ॥

పుష్పార్చన

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
పుష్పైః పూజయామి.
(పుష్పాలతో అర్చించాలి. అలంకరించిన స్వామిని మనస్సులో దర్శించి ప్రార్థన చేయాలి.)

చతుర్వింశతి నామార్చన

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
(వ్యూహనామాలతో ప్రారంభమయ్యే నామావళితో పుష్పార్చన చేయాలి.)

ఓం కేశవాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః

ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః

ఓం జనార్దనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః

శ్రీ రామాష్టోత్తర శతనామావళిః

ఓం శ్రీరామాయ నమః
ఓం రామభద్రాయ నమః
ఓం రామచంద్రాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం రాజీవలోచనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం రాజేంద్రాయ నమః
ఓం రఘుపుంగవాయ నమః
ఓం జానకీవల్లభాయ నమః
ఓం జైత్రాయ నమః

ఓం జితామిత్రాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం విశ్వామిత్రప్రియాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం శరణత్రాణతత్పరాయ నమః
ఓం వాలిప్రమథనాయ నమః
ఓం వాగ్మినే నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్యవిక్రమాయ నమః
ఓం సత్యవ్రతాయ నమః

ఓం వ్రతధరాయ నమః
ఓం సదాహనుమదాశ్రితాయ నమః
ఓం కౌసలేయాయ నమః
ఓం ఖరధ్వంసినే నమః
ఓం విరాధవధపండితాయ నమః
ఓం విభీషణపరిత్రాత్రే నమః
ఓం హారకోదండఖండనాయ నమః
ఓం సప్తతాలప్రభేత్రే నమః
ఓం దశగ్రీవశిరోహరాయ నమః
ఓం జామదగ్న్యమహాదర్పదళనాయ నమః

ఓం తాటకాంతకాయ నమః
ఓం వేదాంతసారాయ నమః
ఓం వేదాత్మనే నమః
ఓం భవరోగస్యభేషజాయ నమః
ఓం దూషణత్రిశిరోహంత్రే నమః
ఓం త్రిమూర్తయే నమః
ఓం త్రిగుణాత్మకాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం త్రిలోకాత్మనే నమః
ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః

ఓం త్రిలోకరక్షకాయ నమః
ఓం ధన్వినే నమః
ఓం దండకారణ్యకర్తనాయ నమః
ఓం అహల్యాశాపశమనాయ నమః
ఓం పితృభక్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం జితేంద్రియాయ నమః
ఓం జితక్రోధాయ నమః
ఓం జితామిత్రాయ నమః
ఓం జగద్గురవే నమః

ఓం ఋక్షవానరసంఘాతినే నమః
ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః
ఓం జయంతత్రాణవరదాయ నమః
ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః
ఓం సర్వదేవాదిదేవాయ నమః
ఓం మృతవానరజీవనాయ నమః
ఓం మాయామారీచహంత్రే నమః
ఓం మహాదేవాయ నమః
ఓం మహాభుజాయ నమః
ఓం సర్వదేవస్తుతాయ నమః

ఓం సౌమ్యాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం మునిసంస్తుతాయ నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహోదారాయ నమః
ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః
ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః
ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః
ఓం ఆదిపురుషాయ నమః
ఓం పరమపురుషాయ నమః

ఓం మహాపురుషాయ నమః
ఓం పుణ్యోదయాయ నమః
ఓం దయాసారాయ నమః
ఓం పురాణపురుషోత్తమాయ నమః
ఓం స్మితవక్త్రాయ నమః
ఓం మితభాషిణే నమః
ఓం పూర్వభాషిణే నమః
ఓం రాఘవాయ నమః
ఓం అనంతగుణగంభీరాయ నమః
ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః

ఓం మాయామానుషచారిత్రాయ నమః
ఓం మహాదేవాదిపూజితాయ నమః
ఓం సేతుకృతే నమః
ఓం జితవారాశయే నమః
ఓం సర్వతీర్థమయాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్యామాంగాయ నమః
ఓం సుందరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం పీతవాససే నమః

ఓం ధనుర్ధరాయ నమః
ఓం సర్వయజ్ఞాధిపాయ నమః
ఓం యజ్వనే నమః
ఓం జరామరణవర్జితాయ నమః
ఓం విభీషణప్రతిష్ఠాత్రే నమః
ఓం సర్వాపగుణ వర్జితాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరస్మైబ్రహ్మణే నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
ఓం పరంజ్యోతిషే నమః

ఓం పరంధామ్నే నమః
ఓం పరాకాశాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం పారగాయ నమః
ఓం పారాయ నమః
ఓం సర్వదేవాత్మకాయ నమః
ఓం పరాయ నమః

ఇతి శ్రీరామాష్టోత్తర శతనామావళిః

శ్రీరామానుజాష్టోత్తర శతనామావళిః

ఓం రామానుజాయ నమః
ఓం పుష్కరాక్షాయ నమః
ఓం యతీశ్వరాయ నమః
ఓం కరుణాకరాయ నమః
ఓం కాంతిమత్యాత్మజాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం లీలామానుషవిగ్రహాయ నమః
ఓం సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సజ్జనప్రియాయ నమః

ఓం నారాయణకృపాపాత్రాయ నమః
ఓం శ్రీభూతపురనాయకాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భక్తమందారాయ నమః
ఓం కేశవానందవర్ధనాయ నమః
ఓం కాంచీపూర్ణ ప్రియసఖాయ నమః
ఓం ప్రణతార్తివినాశకాయ నమః
ఓం పుణ్యసంకీర్తనాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం బ్రహ్మరాక్షసమోచకాయ నమః

ఓం యాదవాపాదితాపార్థ వృక్షచ్ఛేద కుఠారకాయ నమః
ఓం అమోఘాయ నమః
ఓం లక్షణమునయే నమః
ఓం శారదాశోకనాశనాయ నమః
ఓం నిరస్తర జనాజ్ఞాన నిర్మోచన విచక్షణాయ నమః
ఓం వేదాంతద్వయసారజ్ఞాయ నమః
ఓం వరదా యామ్బుదాయకాయ నమః
ఓం పరేఙ్గితజ్ఞాయ నమః
ఓం నీతిజ్ఞాయ నమః
ఓం యామునాంగులిమోచకాయ నమః

ఓం దేవరాజకృపాలబ్ధ షడ్వాక్యార్థ మహోదధయే నమః
ఓం పూర్ణార్యలబ్ధసన్మంత్రాయ నమః
ఓం శౌరిపాదాబ్దషట్పదాయ నమః
ఓం త్రిదండధారిణే నమః
ఓం బ్రహ్మజ్ఞాయ నమః
ఓం బ్రహ్మధ్యానపరాయణాయ నమః
ఓం రంగేశకైంకర్యరతాయ నమః
ఓం విభూతిద్వయనాయకాయ నమః
ఓం గోష్టీపూర్ణ కృపాలబ్ధ మంత్రరాజ ప్రకాశకాయ నమః
ఓం వరరంగానుకంపాత్త ద్రావిడామ్నాయ పారగాయ నమః

ఓం మాలాధరార్యసుజ్ఞాత ద్రావిడామ్నాయ తత్వధియే నమః
ఓం చతుస్సప్తతి శిష్యాఢ్యాయ నమః
ఓం పంచాచార్యసమాశ్రయాయ నమః
ఓం ప్రపీత విషతీర్థామ్భః (ప్రకటీకృతవైభవాయ) నమః
ఓం పవిత్రీకృత కూరేశాయ నమః
ఓం భాగినేయ త్రిదండకాయ నమః
ఓం కూరేశ దాశరథ్యాది చరమార్థ ప్రదాయకాయ నమః
ఓం రంగేశ వేంకటేశాది ప్రకటీకృత వైభవాయ నమః
ఓం దేవరాజార్చన రతాయ నమః
ఓం మూక ముక్తిప్రదాయకాయ నమః

ఓం యజ్ఞమూర్తి ప్రతిష్ఠాత్రే నమః
ఓం మన్నాథాయ నమః
ఓం ధరణీధరాయ నమః
ఓం వరదాచార్య సద్భక్తాయ నమః
ఓం యజ్ఞేశార్తి వినాశకాయ నమః
ఓం అనంతాభీష్ట ఫలదాయ నమః
ఓం విట్ఠలేంద్రప్రపూజితాయ నమః
ఓం శ్రీశైలపూర్ణ కరుణాలబ్ధ రామాయణార్థకాయ నమః
ఓం ప్రపత్తిధర్మైకరతాయ నమః
ఓం గోవిందార్య ప్రియానుజాయ నమః

ఓం వ్యాస సూత్రార్థ తత్వజ్ఞాయ నమః
ఓం బోధాయనమతానుగాయ నమః
ఓం శ్రీభాష్యాదిమహాగ్రంథకారకాయ నమః
ఓం కలినాశనాయ నమః
ఓం అద్వైతమత విచ్ఛేత్రే నమః
ఓం విశిష్టాద్వైత పాలకాయ నమః
ఓం కురంగనగరీ పూర్ణ మంత్రరత్నోపదేశకాయ నమః
ఓం వినాశితాఖిలమతాయ నమః
ఓం శేషీకృత రమాపతయే నమః
ఓం పుత్రీకృత శఠారాతయే నమః

ఓం శఠజిత్సూక్తి వర్ధనాయ నమః
ఓం భాషాదత్త హయగ్రీవాయ నమః
ఓం భాష్యకారాయ నమః
ఓం మహాయశసే నమః
ఓం పవిత్రీకృతభూభాగాయ నమః
ఓం కూరనాథప్రకాశకాయ నమః
ఓం శ్రీవేంకటాచలాధీశ శంఖ చక్ర ప్రదాయకాయ నమః
ఓం శ్రీవేంకటేశ శ్వశురాయ నమః
ఓం శ్రీరామసఖ దేశికాయ నమః
ఓం కృపామాత్ర ప్రసన్నార్యాయ నమః

ఓం గోపీకా మోక్షదాయకాయ నమః
ఓం సమీచీనార్య సచ్చిష్య సత్కృతాయ నమః
ఓం వైష్ణవ ప్రియాయ నమః
ఓం క్రీమికంఠనృప ధ్వంసినే నమః
ఓం సర్వ మంత్ర మహోదధయే నమః
ఓం అఙ్గీకృతాన్ధ్రపూర్ణాఖ్యాయ నమః
ఓం సాలగ్రామ ప్రతిష్ఠితాయ నమః
ఓం శ్రీ భక్త గ్రామ పూర్ణేశాయ నమః
ఓం విష్ణువర్ధన రక్షకాయ నమః
ఓం బౌద్ధధ్వాన్త సహస్రాంశవే నమః

ఓం శేషరూపప్రదర్శకాయ నమః
ఓం నగరీకృతవేదాద్రయే నమః
ఓం డిల్లీశ్వరసమర్చితాయ నమః
ఓం నారాయణప్రతిష్ఠాత్రే నమః
ఓం సంపత్పుత్ర విమోచకాయ నమః
ఓం సంపత్కుమార జనకాయ నమః
ఓం సాధులోక శిఖామణయే నమః
ఓం సుప్రతిష్ఠిత గోవిందరాజాయ నమః
ఓం పూర్ణమనోరథాయ నమః
ఓం గోదాగ్రజాయ నమః

ఓం దిగ్విజేత్రే నమః
ఓం గోదాభీష్ట ప్రపూరకాయ నమః
ఓం సర్వ సంశయ విచ్ఛేత్రే నమః
ఓం విష్ణులోక ప్రదాయకాయ నమః
ఓం అవ్యాహత మహద్వర్త్వనే నమః
ఓం యతి రాజాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం శ్రీమతే రామానుజాయ నమః

ఇతి శ్రీరామానుజాష్టోత్తర శతనామావళిః

నమస్కారాలు

ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః.
ఓం శ్రీదేవ్యై నమః.
ఓం శ్రీభూదేవ్యై నమః.
ఓం శ్రీనీలాదేవ్యై నమః.
ఓం శ్రీగోదాదేవ్యై నమః.

ఓం శ్రీమతే అనంతాయ నమః.
ఓం శ్రీమతే గరుడాయ నమః.
ఓం శ్రీమతే విష్వక్సేనాయ నమః.
ఓం శ్రీహనుమతే నమః.

ఓం శ్రీ పరాంకుశాయ నమః
ఓం శ్రీమతే రామానుజాయ నమః
ఓం శ్రీమద్వరవరమునయే నమః
ఓం స్వాచార్యేభ్యో నమః
ఓం పూర్వాచార్యేభ్యో నమః

ధూప దీప నైవేద్యాద్యుపచారాలు

ఓం సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః.

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
ధూపం ఆఘ్రాపయామి.
(అగరు ధూపాన్ని చూపాలి.)

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
దీపం సందర్శయామి.
(దీపాన్ని చూపాలి.)

శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
(ఉద్ధరిణితో మూడుసార్లు వేరువేరుగా నీటిని స్వామి నోటికి సమర్పించి, పతద్గ్రహ పాత్రలో విడువాలి.)

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః.
నైవేద్యం సమర్పయామి.
(“ఓం” అని స్మరిస్తూ పండ్లు, పాలు ఇత్యాదులను మృగముద్రతో నైవేద్యంగా సమర్పించాలి. రాజభోగం అయితే, ఐదు వ్రేళ్లను కలిపి గ్రాసముద్రతో సమర్పించాలి.)

హస్తౌ ప్రక్షాళయామి.
(ఉద్ధరిణితో ఒకసారి నీటిని స్వామి హస్తాలకు సమర్పించి, పతద్గ్రహ పాత్రలో విడువాలి.)

పాదౌ ప్రక్షాళయామి.
(ఉద్ధరిణితో రెండుసార్లు వేరువేరుగా నీటిని స్వామి పాదాలకు సమర్పించి, పతద్గ్రహ పాత్రలో విడువాలి.)

గండూషణం సమర్పయామి.
(ఉద్ధరిణితో మూడుసార్లు వేరువేరుగా నీటిని స్వామి నోటికి సమర్పించి, పతద్గ్రహ పాత్రలో విడువాలి.)

తాంబూలం సమర్పయామి.
(తాంబూలాన్ని సమర్పించాలి.)

నీరాజనం

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః।
నీరాజనం సమర్పయామి।

శ్రియఃకాన్తాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినామ్ ।
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥

మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే ।
చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళమ్ ॥

ఆసాద్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయా ।
రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళమ్ ॥

శేషో వా సైన్యనాథో వా శ్రీపతిర్వేతి సాత్త్వికైః ।
వితర్క్యాయ మహాప్రాజ్ఞైర్భాష్యకారాయ మంగళమ్ ॥

మంగళాశాసనపరైర్మదాచార్యపురోగమైః ।
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ ॥

(హారతిని పక్కన ఉంచి, నీటితో ప్రోక్షించి, నమస్కారం చేయాలి.)

క్షమాప్రార్థన

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం రఘూత్తమ ।
యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ॥

ఉపచారాపదేశేన కృతానహరహర్మయా ।
అపచారానిమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ ॥

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయన్తాం
న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః ।
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాః సమస్తాః సుఖినో భవంతు ॥

కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ ।
దేశోఽయం క్షోభరహితో బ్రాహ్మణాః సన్తు నిర్భయాః ॥

కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ ।
కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ॥

శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ॥

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ॥

పర్యంకాసన సమర్పణం

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః।
పర్యంకాసనం సమర్పయామి॥

ఉద్వాసనము

శ్రీరామపాదుకాయుగ్మాయ శ్రీమతే రామానుజాయ నమః।
ఉద్వాసనం సమర్పయామి॥

(శ్రీభగవద్ రామానుజాచార్యుల తిరువడులను ధరించిన శ్రీరామపాదుకలను మీ హృదయకమలంలో ఆవాహన చేసి శయనింపజేయాలి.)

Scroll to Top